వరుణ్ తేజ్, “గద్దలకొండ గణేష్”(వాల్మీకి) చిత్రం వసూళ్ల వివరాలు…

0
288

సెప్టెంబర్ 20న విడుదలైన “గద్దలకొండ గణేష్”(వాల్మీకి) చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్, పూజా హేగ్దే హీరో హీరోయిన్లుగా నటించగా, తమిళ హీరో అధర్వ మురళి, మృణాళిని రవి ముఖ్య పాత్రల్లో నటించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 6కోట్లు వసూలు చేసిందని సమాచారం. మన తెలుగు రాష్ట్రాల్లోనే 4.7కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం విమర్శకులను సైతం ఆకట్టుకుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ విలన్ గా మరియు హీరోగా తన పాత్రలో జీవించేసాడు. పూజా హేగ్దే తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అధర్వ అయితే యువ చిత్ర దర్శకుడు అభిగా చాలా చక్కగా నటించాడు. దీనికి మిక్కీ జె మేయర్ సంగీతం తోడవడంతో ఈ సినిమా హిట్ చిత్రంగా నిలిచింది.

తమిళ్ లో “జిగర్తాండ” మూవీ రీమేక్ గా ఈ చిత్రాన్ని వరుణ్ కు తగ్గట్టు కొన్ని మార్పులు చేసి తెరకెక్కించారు.
14రీల్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరించారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here