మహేష్, బన్నీలకు వెంకీ మామ షాక్..

0
58

రియల్ లైఫ్ లో మామా అల్లుళ్లయిన వెంకటేష్, నాగ చైతన్య ‘వెంకీ మామ’ చిత్రంలో మామా అల్లుళ్లలా నటించారు. పాయల్ రాజపుట్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. అయితే మొదట్లో ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుని తర్వాత వేరే సినిమాలతో సంక్రాంతి బరి నుండి తప్పుకుని డిసెంబర్ 13 న వెంకటేష్ బర్త్ డే సందర్బంగా విడుదల చేయాలని అనుకున్నారనే విషయం తెలిసిందే.

అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ వెంకీ మామ చిత్రాన్ని డిసెంబర్ లో కాకుండా జనవరి 10 న గాని 14 కి గాని విడుదల చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇంకా దీనిపై చిత్రబృందం నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇప్పటికే ఈ చిత్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. ఇది నిజంగా అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ మరియు మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ లకు పెద్ద షాక్ అనే చెప్పాలి.

ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్, పోసాని, రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here