Venky Mama: సంక్రాంతి బరి నుండి తప్పుకున్న ‘వెంకీ మామ’

0
64

కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ”వెంకీ మామ”. దసరాకు ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేద్దామని అనుకున్నారు.

కానీ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’, అల్లు అర్జున్ ‘అల … వైకుంఠపురములో…’, కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ ‘దర్బార్’ మూవీ కూడా సంక్రాంతి సీజన్లోనే రిలీజ్ అవుతుండడంతో ఈ భారీ కాంపిటీషన్ లో థియేటర్లు దక్కగపోగా కలెక్షన్లు కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంది. అందుకే చిత్ర బృందం ఎక్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి ఈ మూవీని సంక్రాంతికి ముందుగానే రిలీజ్ చేయాలనీ నిర్ణయించారు.

ఈ మల్టీస్టారర్ చిత్రంలో వెంకటేష్, నాగ చైతన్య మామ అల్లుళ్లలాగా వారి సరసన రాశి ఖన్నా, పాయల్ రాజపుట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో డి.సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 6 న విడుదల చేయనున్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here