‘నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ మామా..’ – వెంకీ మామ టైటిల్ సాంగ్

0
50

వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘వెంకీ మామ’. ఈ చిత్రంలో పాయల్ రాజపుట్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకటేష్, నాగ చైతన్య మామ అల్లుళ్లలా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వెంకీ మామ ఫస్ట్ గ్లింప్స్ రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా వెంకీ మామ టైటిల్ సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసారు.

ఈ సాంగ్ మామ అల్లుళ్లు ఎప్పటికీ ఇలా మంచిగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్లు ఒక లేడీ వాయిస్ తో స్టార్ట్ అవుతుంది. తర్వాత ‘మామ మామ మామ నే పలికిన తొలి పదమా.. నాకే దొరికిన వరమా.. నాకై నిలిచిన బలమా.. నీ కాలి అడుగుల్లో ఉంది నా గుడి.. నీ నోటి పలుకుల్లో ఉంది నా బడి.. పుడుతూనే నీ ఒడిలో పాపనై పడి.. నీ పేరై మోగింది గుండె సవ్వడి….అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామా.. నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ మామా..’ అంటూ మేనమామ అల్లుడి మధ్య బంధాన్ని అద్భుతంగా చూపించారు ఈ పాటలో. లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి రాయగా శ్రీ కృష్ణ ఈ గానాన్ని ఆలపించారు.

అంతేకాకుండా ఈ సాంగ్ రిలీజైన ఒక గంటలోనే 1.3 లక్షల వ్యూస్ ని సాధించి రికార్డు క్రియేట్ చేసింది. వెంకీ మామ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో దీన్ని బట్టి అర్ధమవుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దగ్గుబాటి సురేష్ బాబు, టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here