‘వెంకీ మామ’ విడుదల తేదీ ఖరారు..

0
283

రియల్ లైఫ్ లో మామా అల్లుళ్లయిన వెంకటేష్ నాగ చైతన్య మామా అల్లుళ్లలా నటించిన చిత్రం ‘వెంకీ మామ’. పాయల్ రాజపుట్ రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. అయితే మొదట్లో ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుని తర్వాత వేరే సినిమాలతో సంక్రాంతి బరి నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్ ‘వెంకీ మామ’ చిత్రాన్ని డిసెంబర్ 13 న వెంకటేష్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

 

ఇప్పటికే ఈ చిత్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్, పోసాని, రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here