Vijay Deverakonda: తరుణ్ భాస్కర్, ‘మీకు మాత్రమే చెప్తా’ మూవీ ట్రైలర్…

6
524

దర్శకుడు తరుణ్ భాస్కర్.. తొలిసారిగా హీరోగా నటిస్తున్న చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ చిత్రంలో వాణి భోజన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కొంతకాలం క్రితం రిలీజైన ఈ మూవీ టీజర్ కి మంచి స్పందన లభించింది. తాజాగా ఈరోజు (అక్టోబర్ 16), ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసారు.

ఇందులో తరుణ్ భాస్కర్ కామెడీ అంతాఇంతా కాదు. ఇందులో తాను ఫోన్ లో వీడియోలు చూస్తుంటే వాటిలో ఒకటి తనదే అవడం ఆపై జరిగే సన్నివేశాలు మనల్ని కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి. అంతేకాకుండా బ్యాక్ గ్రౌండ్ లో వెన్నెల కిశోర్ వాయిస్ కూడా చాలా బాగుంది.

ఇంకా ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మొదటిసారిగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ విజయ్ దేవర కొండ ప్రొడక్షన్ హౌస్ కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై, షమీర్ సుల్తాన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. శివ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 1 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here