విశాల్, తమన్నా ‘యాక్షన్’ మూవీ రివ్యూ..

0
99

సినిమా: యాక్షన్‌
నటీనటులు: విశాల్‌, తమన్నా, ఐశ్వర్య లక్ష్మి, ఆకాంక్షా పూరి తదితరులు
దర్శకుడు: సి. సుందర్‌
నిర్మాత: ఆర్‌. రవీంద్రన్‌
కూర్పు: ఎన్‌.బి. శ్రీకాంత్‌
సంగీత దర్శకుడు: హిప్‌హాప్‌ తమిజా
విడుదల తేదీ: 15-11-2019

విశాల్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘యాక్షన్’. ఈ చిత్రానికి సి. సుందర్ దర్శకత్వం వహించారు. గతంలో విశాల్ ‘డిటెక్టివ్‌’, ‘అభిమ‌న్యుడు’ చిత్రాల‌తో ఆక‌ట్టుకున్నారు. ఈసారి ఏకంగా రూ.60 కోట్ల బ‌డ్జెట్‌తో ‘యాక్షన్‌’ సినిమా తీశారు. మరి ఈ మూవీ మాస్ ప్రియులను మెప్పించిందా? యాక్షన్ హిట్ అయినట్టేనా..?

కథ: సుభాష్ (విశాల్‌) ఆర్మీ ఆఫీసర్. త‌న‌కు కుటుంబం అంటే చాలా ఇష్టం. నాన్న ముఖ్యమంత్రి. అన్నయ్య ఉప ముఖ్యమంత్రి. సుభాష్‌ మ‌ర‌ద‌ల్ని పెళ్లి చేసుకుందామ‌నుకుంటాడు. కానీ మాలిక్ అనే ఉగ్రవాది తన మరదలిని, అన్నయ్యను చంపేస్తాడు. ఈ నింద తన నాన్నపై పడుతుంది. దీనంతటికీ కారణమైన ఉగ్రవాది మాలిక్ పాకిస్తాన్ లో రాజభోగాలనుభవిస్తూ ఉంటాడు. దీంతో ఆ ఉగ్రవాది మాలిక్ ను ఎలాగైనా పట్టుకుని తీసుకురావాలని సుభాష్ ప్రయత్నిస్తాడు. మరి సుభాష్ పట్టుకున్నాడా? ఈ క్రమంలో తనకు ఎదురైన సమస్యలేంటి? అనేది తెరపైన చూడాల్సిందే.

రివ్యూ: పేరుకు తగ్గట్టుగానే ఇది పూర్తిగా యాక్షన్ చిత్రం. ఖర్చుపెట్టిన ప్రతీ పైసా విలువ కనిపించేలా చాలా బాగా తీశారు. సినిమాలో సగానికి పైగా ఫైటింగులు, ఛేజింగులు ఉంటాయి. మాస్ ప్రియులకు నచ్చేలా తెరకెక్కించారు డైరెక్టర్ సుందర్. ఇంటర్వెల్ కి ముందుగా వచ్చే సీన్ మాత్రం హాలీవుడ్ మూవీని తలపించేలా తీశారు. ఫస్ట్ పార్ట్ లో లవ్ సీన్స్ తో కొంచం స్లో గా ఉన్నా సెకండ్ పార్ట్ లో మాత్రం ఛేజింగులు, ఫైటింగులు మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.

ఎలా ఉందంటే: సెకండ్ హాఫ్ లో మాలిక్ ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చే ఎపిసోడ్ మొత్తం హాలీవుడ్ ‘బేబీ’ మూవీని పోలి ఉంది. బ్యాంక్‌లో చొర‌బ‌డి ఎకౌంట్‌ని హ్యాక్ చేసే స‌న్నివేశం ఉత్కంఠ‌ క‌లిగిస్తుంది. అక్కడక్కడ ఉత్కంఠ‌.. కొన్ని చోట్ల బోరింగ్‌ గా ఉన్నా యాక్షన్ సీన్స్ అందరిని ఆకట్టుకుంటాయి. ఇక విశాల్ ఐతే తన పాత్రలో జీవించేసారు. తమన్నా తన అందాలను చూపిస్తూనే యాక్షన్ సీన్స్ కూడా చాల బాగా చేసింది. మిగతా వారు కూడా వారి పాత్రలకు న్యాయం చేసారు. కథ చిన్నదే అయినా యాక్షన్ స‌న్నివేశాల్ని తెర‌కెక్కించిన విధానం బాగుంది. నిర్మాణ ప‌రంగా బాగా ఖర్చు పెట్టారు. ప్రతీ పైసా తెర‌పై క‌నిపిస్తుంది. కెమెరా ప‌నిత‌నం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందరిని ఆక‌ట్టుకుంటాయి. పాట‌లు త‌క్కువే. మొత్తానికి మాస్ ప్రియులకు నచ్చే విధంగా తెరకెక్కించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here