VT10: ముంబైలో బాక్సింగ్ ప్రాక్టీస్ చేయనున్న Varun Tej

0
40

‘గద్దలకొండ గణేష్’ మూవీతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు తన 10 వ సినిమాను నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ చిత్రంలో వరుణ్ ఒక బాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించనున్నాడు. క్రీడా నేపథ్యంలో వరుణ్ కి ఇది మొదటి చిత్రం.

ఈ సినిమా కోసం వరుణ్ కొంత కాలం క్రితం అమెరికాలో ఒలింపిక్ విన్నర్ టోనీ జెఫ్రీస్ వద్ద 2 నెలలు బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్నాడన్నది తెలిసిన విషయమే. అయితే మధ్యలో గద్దలకొండ గణేష్ మూవీ వలన ఆగిన తన ప్రాక్టీస్ ని ముంబైలో కొనసాగించనున్నారు వరుణ్. దాదాపు రెండు నెలల పాటు ముంబైలో ట్రైనింగ్ తీసుకోబోతున్నాడట.

ఈ సినిమాలో వరుణ్ ఒక పర్ఫెక్ట్ బాక్సర్ ల కనిపించడానికి ఎంత ప్రిపేర్ అవుతున్నాడో తెలుస్తోంది. ట్రైనింగ్ పూర్తయ్యాక జనవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం.

ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్ పై అల్లు వెంకటేష్ సిద్దు ముద్దా నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here