భారీ జన సందోహాన్ని చూసి ఉప్పొంగిపోయిన జగన్ ఏం చేశారంటే…

0
153

ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరును కొనసాగిస్తున్నాయి. నేడు వైసీపీ అధినేత జగన్ ప్రకాశం జిల్లా గిద్దలూరు రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీగా జనం హాజరయ్యారు. ఆ భారీ జన సందోహాన్నిచూసి ఉప్పొంగిపోయిన జగన్ లయబద్దంగా డప్పు శబ్దం చేసి అలరించారు. అప్పటి వరకూ ప్రసంగించిన లోక్‌సభ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి మైక్‌కు అంటిన చెమటను తుడిచి జగన్‌కు అందించారు. మొదట మైక్ చెక్ చేస్తూ డప్పు శబ్దం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. జగన్ లయ బద్దంగా వినిపించిన డప్పు శబ్దానికి అభిమానులు, కార్యకర్తలు ఉత్సాహంతో ఊగిపోయారు. అభిమానులను నిదానించాలంటూ సూచనలు చేయడం అందరినీ ఆకట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here