నేను వెళ్లే సరికి 15 రకాల బిర్యానీ ఐటమ్స్ ముందర పెట్టుకుని కూర్చున్నాడు – Rajamouli

0
235

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ప్రతిష్టాత్మక చిత్రం ”బాహుబలి”. లండన్ లో ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో అక్టోబర్ 19 సాయంత్రం 7 గంటలకు ”బాహుబలి: ది బిగినింగ్” మూవీ ప్రదర్శన చాలా అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, ప్రభాస్, రాణా, అనుష్క మరియు సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి హాజరయ్యారు.

నేను వారికి ఎటువంటి డైట్ ఇవ్వలేదు – రాజమౌళి:  ఈ సందర్బంగా వారు డైరెక్టర్ రాజమౌళిని ‘మీరు ఈ మూవీ లో ప్రభాస్ రాణా అలా బల్క్ గా కనిపించడానికి ఎటువంటి డైట్ ఇచ్చారు?’ అని అడిగారు.

దానికి రాజమౌళి ”వారికి నేను ఎటువంటి డైట్ ఇవ్వలేదు. కానీ ఈ మూవీ లో వారెలా కనిపించాలో మాత్రమే చెప్పాను. వారికి వారి సొంత డైటీషియన్స్, డాక్టర్స్, ఫిజికల్ ట్రైనర్స్ ఉన్నారు. వారి రెగ్యులర్ డైటింగ్ లో కొన్ని వారాల పాటు ప్రతి 2 గంటలకొకసారి బీన్స్ తినాలి అది చాలా కష్టం. బాహుబలి పార్ట్ 1 లో కన్నా రెండవ పార్ట్ లో బాడీ మజిల్స్ ఎక్కువ చూపించడానికి ప్రభాస్, రాణా చాలా కష్టపడ్డారు.

10-15 రకాల బిర్యానీ ఐటమ్స్ ఉన్నాయి – రాజమౌళి: ప్రభాస్ డైటింగ్ గురించి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ప్రతి నెలకు ఒకరోజు చీట్ మీల్ట్ డే (డైటింగ్ ఫాలో అవకుండా ఇష్టమైన భోజనం చేయడం) లా ఆరోజు ప్రభాస్ ఎటువంటి డిస్ ప్లే ఇచ్చారంటే అక్కడ 10-15 రకాల బిర్యానీలు ఉన్నాయి. అసలు అన్ని రకాల బిర్యానీలు ఉంటాయని కూడా తెలీదు. అన్ని రకాల ఫిష్ ఐటమ్స్, చికెన్, మటన్ కర్రీ ఐటమ్స్ అవే కాకుండా ఫ్రై ఐటమ్స్ కూడా ఉన్నాయి. అలాంటి ఫుడ్ ఐటమ్స్ డిస్ ప్లే ఇస్తారని అసలు ఊహించలేదు.

అప్పటికి తెల్లవారు జామున 2am కి వాలీ బాల్ ఆడుతూ ఉన్నాము. అక్కడికి ప్రభాస్ బావ వచ్చారు. ఆయనను అడిగాను ‘ఏంటండీ ఈ ఫుడ్ మీ ఇంటికి వచ్చిన వారిని ఇలా ఫుడ్ పెట్టి చంపేస్తారా’ అని అడిగితె ఆయన ‘మేము ఇన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టాము కానీ ప్రభాస్ మీరు ఊహించనిది అడుగుతాడు చూడండి’ అన్నాడు.

నెయ్యి తొక్కుపచ్చడి లేదా బావ – ప్రభాస్: ఆట ఆడిన తర్వాత వెల్తే ప్రభాస్ అక్కడ అన్ని ఐటమ్స్ చూసి ఏమన్నాడంటే ‘అన్ని ఫుడ్ వెరైటీస్ ఉన్నాయి కానీ నెయ్యి తొక్కు పచ్చడి లేదా బావ’ అన్నాడు. ప్రభాస్ వాళ్ల బావ నన్ను చూసి ‘చెప్పానా అండి’ అని చెప్పి అతను 2am కి ఇంటికి వెళ్లి, తన భార్యను నిద్రలేపి, పచ్చడి తెస్తే, ఆ పచ్చడితో తిన్నాకే తన భోజనాన్ని కానిచ్చాడు ప్రభాస్. అది ప్రభాస్ అంటే’ అని రాజమౌళి ప్రభాస్ తో తన ఫన్నీ ఇన్సిడెంట్ గురించి చెప్పారు.

ఇది వింటుంటే ‘ముందు ఎన్ని పంచభక్ష పరమాన్నాలు ఉన్నా పచ్చడి కోసం చూసే వాడే అసలైన తెలుగువాడు’ అనే సామెత నిజమేనని అనిపించక మానదు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here