జల్సాలకు అలవాటు పడిన భార్య తన ఇద్దరు ప్రియులతో భర్తను చంపించింది

0
79

భర్త చాలీచాలని సంపాదన ఆమెకు నచ్చలేదు. దీంతో కాస్త పై స్థాయిలో ఉన్న భర్త స్నేహితులతోనే అక్రమ సంబంధం పెట్టుకుంది. వద్దని వారిస్తున్న భర్తను చంపించేస్తే తనకు అడ్డు ఉండదనుకుంది. ప్రియుళ్ల సాయంతో భర్తను హత్య చేయించింది. ఇది ఐదు నెలల క్రితం జరిగిన ఘటన.. తాజాగా వెలుగు చూసింది. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

శుక్రవారం నిర్మల్‌ డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. అంకాపూర్‌కు చెందిన ఉదయ్‌ కుమార్‌ (40), పావని (30) దంపతులకు సమన్య (3) అనే కూతురు ఉంది. ఉదయ్‌.. రోజూ కూలికి వెళుతూ వచ్చే సంపాదనతో భార్య, బిడ్డను పోషించుకుంటున్నాడు. ఉదయ్‌కి అదే గ్రామానికి చెందిన దౌలాజీ, గంగాధర్‌ స్నేహితులున్నారు. దౌలాజీ కారు డ్రైవరుగా జీవనం సాగిస్తుండగా.. గంగాధర్‌ ఉపాధి కోసం దుబాయికి వెళ్లి.. 6 నెలల క్రితమే వచ్చాడు. వీరిద్దరూ ఉదయ్ ఇంటికి వచ్చి పోయే క్రమంలో పావనితో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న భర్త పావనికి వద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.

దీంతో భర్త హత్యను హత్య చేస్తే తనకు అడ్డు ఉండదనుకుంది. పథకం వేసి.. తన ప్రియుళ్లను హత్యకు పురమాయించింది. పథకం ప్రకారం దౌలాజీ, గంగాధర్‌ ఉదయ్‌ని నిర్మల్‌ జిల్లా మామడ మండలం పొన్కల్‌ గోదావరి సమీపానికి తీసుకెళ్లి అతిగా మద్యం తాగించారు. అనంతరం నదిలో స్నానం చేద్దామని నమ్మించి.. గోదావరి నీళ్లలో ముంచి హత్యచేశారు. ఒకవైపు తన అన్న కనిపించకపోవడం.. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ అని రావడంతో ఉదయ్ సోదరి లక్ష్మి.. పావనిని నిలదీసింది. పావని పొంతన లేని సమాధానాలు.. దౌలాజీతో పావని సహజీవనం విషయాలు తెలుసుకున్న లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరోవైపు జూన్ 9న పొన్కల్‌ గోదావరి నదిలో అనుమానాస్పద స్థితిలో ఓ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు పావని, దౌలాజీలను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించగా విషయం వెలుగు చూసింది. మరో ప్రియుడు హత్యానంతరం తెలివిగా దుబాయ్‌కి పారిపోయాడు. ప్రస్తుతం పావని 8 నెలల గర్భిణి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here