విడుదలకు సిద్ధమైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’

0
54

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై వల్లభ నిర్మిస్తున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ విజయ్ భార్య పాత్రలో నటిస్తుండగా.. రాశీ ఖన్నా, ఇజా బెల్లా, కాథరిన్ ట్రెసా విజయ్ లవర్స్ పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ తో మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ ను ఇచ్చింది. ఈ చిత్రం గం.2:35:37 ని. నిడివిని కలిగి ఉంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజు సందర్బంగా విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here