నిత్యకల్యాణం పవన్.. సీజన్ లో దోమలాంటోడట: విజయసాయిరెడ్డి

0
27

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనను ‘నిత్య కల్యాణం పవన్’ అని సంబోధిస్తూ.. సీజన్‌లో వచ్చిపోయే దోమలాంటోడని ఎద్దేవా చేశారు. ‘‘‘నిత్య కళ్యాణం’ గురించి సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారంటే… సీజన్లో వచ్చిపోయే డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటోడట. వర్షాకాలంలో ఎగిరెగిరి, శీతాకాలంలో చల్లబడి, వేసవిలో కనిపించకుండా పోతాడట.

ఇన్నాళ్లు నడిచిందేమో కాని ఇకపై ‘దోమ’లకు కష్టకాలమే. దళితులకు రాజకీయలెందుకని బండ బూతులు తిట్టిన చింతమనేనికి, బలహీనవర్గాల బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం చదువులెందుకని ప్రశ్నిస్తున్న చంద్రబాబు, పవన్లకు ఏం తేడా లేదు. వీళ్లకు పేదోళ్లన్నా, నిమ్న వర్గాల వారన్నా చాలా చిన్న చూపు. ఎలక్షన్లలో చిత్తుగా ఓడించినందుకు ఇంకా కసి పెంచుకున్నారు’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here