తమ డాన్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్న యువ ఎంపీలు….

0
234

పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ  కొత్తగా ఎంపికైన మహిళా ఎంపీలు నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తి తొలిసారి పార్లమెంట్ కు ఆధునిక వస్త్రధారణతో రావడంతో అదొక చర్చనీయాంశంగా మారిందననేది తెలిసిన విషయమే. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నుస్రత్, బసీర్ హట్ లోక్ సభ స్థానానికి; మిమి, జాదవ్ పూర్ స్థానానికి ఎంపీగా ఉన్నారు.

ఇప్పుడు తాజాగా ఈ సినీతారలు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జరిపే దుర్గా మాత పూజా ఏర్పాట్లలో పాల్గొని సందడి చేసారు. ఈ సందర్బంగా “ఆశే మా దుర్గే” అనే పాటకు వీరిద్దరూ సాంప్రదాయ చీరకట్టులో తమదైన స్టైల్ లో డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో యు ట్యూబ్ లో వైరల్ అయింది.

అయితే ముస్లిం అయిన నుస్రత్, జైన మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆమె పార్లమెంట్ కు సింధూరం ధరించి సమావేశాల్లో పాల్గొనడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీనిపై కొందరు విమర్శించినా , వారికి తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here